మా మిథిల్ జన్మ దిన సంబరం
మరపు రాని మధుర జ్ఞాపకం !!
కీసర లో ఆదివారం పదకొండున
కుటుంబ సపరివార సమేతం గా
అందరం చేసిన అందమైన హడావిడి
అపురూపమైన సంతోషపు సందడి !!
ఆనందం అంబరం అంటెను
ఆటపాటలు కోటలు దాటెను !!
అందమయిన సిరివెన్నెల కురిసెను
అనురాగపు మరుమల్లెలు విరిసెను!!
రెండు వారముల మిట్టు స్మృతుల తో
నిండు మనసు తో వాళ్ళమ్మ వెళ్ళెను !!
గుండె నిండే కొడుకు కబురులు వింటూ
దండి గా వాళ్లయ్య ఖుషీగా మురిసేను !!
ఇంతకన్నా కావలసిందేమని
ఇద్దరమ్మలూ తాతలు కూసిరి !!
మిట్టు మాత్రం పెట్టిన కర్చు తో
మరో కారు వచ్చు కదా అనెను !!
ఈ విధము గా జరిగిన ఉత్సవం
ఈ ఏడాది లో ఇచ్చెను ఉత్సాహం !!
ఇది చదివిన వారికీ మురిపం
ఇక పంపుడు మీ స్పందన త్వరితం !!
@@@@@@@@@@@@@@
లోడ్ అవుతోంది...