ముద్దుల మిట్టూ!!!!!
----------------------
మెల్ బోర్న్ మాణిక్యం మా ముద్దుల మిట్టు !!!
వాడి ఆటల తో పాటలతో చేస్తాడు కనికట్టు !!
పాల బుగ్గలున్న సిసింద్రీ పసివాడు
తాతలు ఇద్దరికీ దగ్గడం నేర్పుతాడు !!
ఏ చోటు నున్న ఎక్కడున్నా అతగాడు
ఎదుటి వారందరి లో నవ్వులు పూయిస్తాడు !!
కలిమి గల చోటుల్లో పసిడి కొండలా ఉంటాడు!
చెలిమి గల నెలవుల్లోమాలిమి తో మెలిగేను !!
అమ్మమ్మ చెంతన మాటల ముత్యాలు పోస్తాడు !
నానమ్మ చేరువలో ఆటల నృత్యాలు చేస్తాడు !
సంజు తాత వీపు పై గుర్రాన్ని తోలేను !!!
అంజి తాత భుజమెక్కి కారు నడిపేను !!
కరాటే కంగుఫూ అని కాలితో తంతాడు !!
ఫుట్ బాలు నైనగాని చేతి తో ఆడతాడు !!
మిట్టు చేష్టలతోమనసెంతో నిండుగ !!
మా ఇంట్లో మాత్రం ప్రతి రోజు పండుగ !!!
లోడ్ అవుతోంది...